Loan App: లోన్ యాప్ లో మీ డాక్యుమెంట్లు షేర్ చేస్తున్నారా? ఒక్క నిమిషం..
Loan App అర్జెంట్ గా డబ్బు తీసుకోవాలంటే బ్యాంకు నుంచి రుణం తీసుకునే బదులు పర్సనల్ లోన్ సహాయం తీసుకోవాలి అని అనుకోవడం కామన్. దీని వల్ల మీరు ఏదో పెద్ద తప్పు చేసినట్టు కాదు.

Loan App: డబ్బు అవసరం కోసం ఏదైనా చేయాలి అనుకుంటున్నారు కొందరు. అర్జెంట్ గా డబ్బు అవసరం వెంటనే డబ్బిచ్చి లోన్ యాప్స్.. సో ఇంకేంటి వెంటనే లోన్ యాప్ కు వెళ్లడం, డబ్బులు నిమిషాల్లో వాడటం వంటివి చేస్తున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా సమయానికి డబ్బులు కట్టకపోతే ఎంత ప్రమాదమో ఈ లోన్ తీసుకున్న వారికి చాలా క్లియర్ గా అర్థం అవుతుంది. నరకాన్ని చూపిస్తుంటారు.
అర్జెంట్ గా డబ్బు తీసుకోవాలంటే బ్యాంకు నుంచి రుణం తీసుకునే బదులు పర్సనల్ లోన్ సహాయం తీసుకోవాలి అని అనుకోవడం కామన్. దీని వల్ల మీరు ఏదో పెద్ద తప్పు చేసినట్టు కాదు. కానీ ఈ మార్గంలో చాలా మోసాలు ఉన్నాయి అని గ్రహించకపోవడం నిజంగా తప్పే. అవసరంలో మైండ్ పని చేయదు. ఇప్పటి గురించి ఆలోచిస్తే తర్వాత ఇంతకు మించి సమస్యను ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈ లోన్ యాప్స్ మోసాల గురించి మీకు తెలియకపోతే, మీరు పశ్చాత్తాపపడాల్సి రావచ్చు. డిజిటల్ లోన్ యాప్‌లలో వ్యక్తిగత పత్రాలను షేర్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. డేటా భద్రతలో చిన్న ఉల్లంఘన కూడా మీకు భారీ నష్టాలను కలిగిస్తుంది. కాబట్టి, వ్యక్తిగత సమాచార రక్షణ కోసం, మీరు ముందుగా రిజర్వ్ బ్యాంక్‌లో రిజిస్టర్ చేసిన లోన్ యాప్‌ను మాత్రమే ఉపయోగించాలి అని గుర్తు పెట్టుకోండి.
యాప్ ఎన్‌క్రిప్ట్ చేశారా? లేదా?: లోన్ యాప్‌లో మీ డాక్యుమెంట్లను షేర్ చేస్తున్నప్పుడు, ఈ డిజిటల్ లోన్ యాప్ ఎన్‌క్రిప్ట్ చేశారో లేదో కూడా గుర్తుంచుకోండి. ఆ యాప్ ల డాక్యుమెంట్ షేరింగ్ పద్ధతి ఎంత సురక్షితం? అనేది గుర్తించాలి. మొబైల్ ఫోన్లో కొన్ని కీలను నొక్కి రుణం పొందాలనే దురాశలో, మీరు మీ వ్యక్తిగత డేటా గోప్యత విషయంలో రాజీ పడుతున్నారు అని గుర్తించండి. ఎందుకంటే పెరుగుతున్న సైబర్ నేరాలు, పత్రాలను ఆన్లైన్లో పంచుకోవడం ఎంతవరకు సురక్షితం అనే ప్రశ్నకు సమాధానం మీకు మీరే క్లారిటీ ఇచ్చుకోవాలి. తక్షణ వ్యక్తిగత రుణం కోసం దరఖాస్తు చేస్తున్నప్పుడు, ముందుగా యాప్ డేటా రక్షణ విధానం గురించి మీకు తెలుసని నిర్ధారించుకోండి. మీకు దీని గురించి ఏదైనా గందరగోళం ఉంటే, యాప్ ఆపరేటర్లను అవసరమైన ప్రశ్నలు అడగండి.
ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండండి
పర్సనల్ లోన్ యాప్‌లలో షేర్ చేసిన డాక్యుమెంట్ల ద్వారా మోసాన్ని నివారించడానికి, ముందుగా సురక్షితమైన ఇమెయిల్‌ను ఉపయోగించండి. వీలైనంత వరకు పంపడానికి జిప్ ఫైల్‌ను కూడా ఉపయోగించండి. మీరు మీ వ్యక్తిగత సమాచారాన్ని PDF ఫైల్ ద్వారా పంచుకుంటే, దానిని పాస్‌వర్డ్‌తో సురక్షితంగా ఉంచవచ్చు. నియంత్రణ లేని లోన్ యాప్‌ల నుంచి ఎప్పుడూ లోన్ తీసుకోకండి. ఎందుకంటే వారు రిజర్వ్ బ్యాంక్ ఎటువంటి మార్గదర్శకాలకు కట్టుబడి ఉండరు. తర్వాత మీరు చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
Disclaimer : అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం అందిస్తున్నాము. దీన్ని ట్రెండింగ్ తెలుగు నిర్ధారించదు. దయచేసి గమనించగలరు.