SBI: మీ ఆదాయం తక్కువ ఉందా? ఇక టెన్షన్ వద్దు.. SBI కి చెందిన ఆ ప్లాన్ ద్వారా లక్షలు సంపాదించవచ్చు..

SBI: మీ ఆదాయం చాలా తక్కువగా ఉందా? కానీ టెన్షన్ వద్దు మీరు డబ్బులు సంపాదించే ఓ మంచి విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే చాలా మంది పెట్టుబడులు పెడుతుంటారు. ఇలాంటి వారికి SBI మ్యూచువల్ ఫండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, Paytm సహకారంతో జనివేష్ SIP పథకాన్ని ప్రారంభించారు. ఈ స్కీమ్ లో జస్ట్ మీరు నెలకు రూ. 250 మాత్రమే పెట్టుబడి పెడితే సరిపోతుంది. మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. అయితే దీన్ని మైక్రో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటారు.
ఈ చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టడం వల్ల తక్కువ ఆదాయ భారతీయ కుటుంబాలు, యువతులకు మంచి రిటర్న్ వస్తాయి. వారికి మంచి చేకూరుతుంది. అయితే ఈ చిన్న SIPని ప్రారంభించడం చాలా సవాలుతో కూడుకున్నది. ఎందుకంటే ఈ మైక్రో SIP బ్రేక్-ఈవెన్ సమయం రెండు నుంచి మూడు సంవత్సరాల మధ్య ఉండేలా చూసుకోవాలి. దీనికంటే ఎక్కువ ఉంటే ఏ సీఈఓ కూడా ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్లరు. జన్ నివేష్ పథకాన్ని ప్రారంభించడానికి RTAలు (రిజిస్ట్రార్లు, బదిలీ ఏజెంట్లు), KRAలు (KYC రిజిస్ట్రేషన్ ఏజెన్సీలు), డిపాజిటరీలు కూడా దీనికి మద్దతు చూపిస్తున్నారట.
జననివేష మైక్రో SIP పథకంపై SBI ఎటువంటి బదిలీ, లావాదేవీ ఛార్జీలను విధించడం లేదు. అయితే చిన్న SIPలకు లావాదేవీ ఛార్జీలు ఎక్కువగా ఉంటాయి. అందుకే SBI జన్ నివేష్ మైక్రో SIP పథకాన్ని ఉచితంగా అందించింది. ఇక ప్రభుత్వ పెట్టుబడి కేవలం ఒక పథకం కాదని.. ఇది భారతదేశం, భారత్ మధ్య అంతరాన్ని తగ్గించే దిశగా ఒక అడుగు అని అంటున్నారు నిపుణులు. అయితే పెట్టే పెట్టుబడి ఎంత చిన్న మొత్తమైనా సరే రిటర్న్స్ మాత్రం అందివ్వాలి. అలాంటి వాటిలో మాత్రమే పెట్టుబడి పెట్టాలి. ఇప్పుడు మనం చెప్పుకున్న స్కీమ్ కూడా అలాంటి కోవా కిందకే వస్తుంది.
అయితే కొన్ని పెట్టుబడి స్కీమ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిందే. లేదంటే సైబర్ నేరగాళ్లు అధిక లాభాల ఆశను చూపించి ఫేక్ ఎక్స్ఛేంజ్లు, పోంజీ స్కీములు, ఫిషింగ్ దాడుల అంటూ చాలా మోసం చేసే అవకాశం కూడా ఉంది. ఇక ఏ సంస్థ కూడా ఊహకందని స్థాయిలో అధిక లాభాలు ఇవ్వదు అని మాత్రం మీరు గుర్తు పెట్టుకోవాలి. మీ ఆలోచన విషయంలో కూడా మీరు జాగ్రత్త పడాలి. మీ పెట్టుబడి వల్ల వారికి వచ్చే లాభార్జనను దృష్టిలో పెట్టుకొని మీకు రిటర్న్స్ ఇస్తుంటారు. అంతే కానీ వందల పెట్టుబడితో కోట్లను ఆశించడం చాలా తప్పు. దాని వల్ల మీరు సమస్యలు కూడా ఎదుర్కొంటారు. ఎవరైనా చెప్పినా సరే ఇలాంటి మోసపూరితమైన స్కీములను నమ్మవద్దు అంటున్నారు నిపుణులు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని trendingtelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.