Gold: ప్రపంచంలో ఏ దేశంలో అత్యధిక బంగారం ఉందంటే?
ఈ ప్రపంచంలో బంగారం అత్యధికంగా అగ్రరాజ్యమైన అమెరికాలో ఉంది. అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మాత్రమే కాదు. అత్యధిక బంగారం ఉన్న దేశం కూడా. అమెరికాలో 8,133.5 టన్నుల బంగారం ఉంది.

Gold: మార్కెట్‌లో బంగారం విలువ రోజురోజుకీ పెరుగుతోంది. అయితే మిగతా దేశాలతో పోలిస్తే ఇండియాలో ఎక్కువగా బంగారం ఉందని అనుకుంటారు. ఎందుకంటే ఇండియన్ ఉమెన్స్ ఏదైనా చిన్న ఫంక్షన్ ఉందంటే చాలు.. బంగారు ఆభరణాలతో నిండిపోతారు. దీనికి తోడు పెళ్లి అంటే చాలు బంగారం గుర్తు వస్తుంది. అసలు బంగారం లేకపోతే పెళ్లి కాదు. ఇలా చూసుకుని ఇండియాలో ఎక్కువగా బంగారం ఉందని అనుకుంటారు. నిజానికి ఇండియాలో కాకుండా ఓ దేశంలో బంగారం అత్యధికంగా ఉందట. ఆ దేశమేదో ఈ స్టోరీలో చూద్దాం.
ఈ ప్రపంచంలో బంగారం అత్యధికంగా అగ్రరాజ్యమైన అమెరికాలో ఉంది. అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మాత్రమే కాదు. అత్యధిక బంగారం ఉన్న దేశం కూడా. అమెరికాలో 8,133.5 టన్నుల బంగారం ఉంది. ఇక రెండో స్థానంలో జర్మనీ 3,351 టన్నులు, ఇటలీ 2,452 టన్నులతో మూడవ స్థానంలో ఉంది. అయితే ఇప్పటి వరకు ప్రపంచంలో దాదాపుగా 2,12,000 టన్నుల బంగారాన్ని వెలికి తీశారు. మొత్తం మూడింటి బంగారంలో రెండు వంతులు మాత్రమే వెలికి తీశారు. అయితే మొత్తం బంగారాన్ని వెలికి తీస్తే.. మూడు ఒలింపిక్ స్విమ్మింగ్ పూల్స్‌లో పడుతుందట. అయితే ప్రతీ ఏడాది చైనా 330 టన్నుల బంగారాన్ని వెలికి తీస్తుంది. అలాగే రష్యా, ఆస్ట్రేలియా కూడా ప్రతీ ఏడాది 320 టన్నుల బంగారాన్ని వెలికి తీస్తుంది. అయితే దేశంలో కూడా బంగారం అధికంగా ఉంది. దేశంలో పద్మనాభ స్వామి ఆలయం, తిరుపతి బాలాజీ ఆలయం, జగన్నాథ ఆలయం, వైష్ణో దేవి ఆలయం వంటి వాటిలో 4000 టన్నులకు పైగా బంగారం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీన్ని అధికారికంగా ప్రకటించలేదు.
ఇదిలా ఉండగా 14, 18, 20, 22, 23, 24 క్యారెట్ల స్వచ్ఛత ఉన్న బంగారం ఉంది. అయితే ఎక్కువగా ఆభరణాలను తయారు చేయడానికి 22, 18, 14 క్యారెట్ల బంగారాన్ని మాత్రమే ఉపయోగిస్తారు. 22 క్యారెట్ల బంగారాన్ని ఆభరణాల తయారీకి ఉపయోగిస్తారు. ఇందులో 91.7 శాతం బంగారం ఉంటుంది. ప్రస్తుతం రోజుల్లో బంగారం ధరలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. మార్కెట్‌లో బంగారం విలువ ఎక్కువగా ఉంది. ప్రస్తుతం తులం బంగారం విలువ లక్ష పైనే ఉంది.
-
Spiritual: ఈ తేదీల్లో పుట్టిన వారు బంగారం వేసుకుంటే.. అంతే సంగతి
-
Gold prices : కొండెక్కుతున్న పసిడి ధరలు.. ఆల్‌టైమ్ రికార్డు స్థాయిలో గోల్డ్
-
Gold: వాడకుండా ఉంటే బంగారం పోతుందా?
-
Vastu Tips: వారంలో ఏ రోజు బంగారం కొనడానికి మంచిదో మీకు తెలుసా?
-
Tips:పాత బంగారు నగలు కొత్తగా మెరవాలా? అయితే ఈ చిట్కాలు పాటించండి
-
Gold: బంగారం కొనుగోలు చేయడానికి పర్సనల్ ఇస్తారా? ఒకవేళ తీసుకుంటే ఏమవుతుంది?