Two-wheeler : టూవీలర్ కొనుగోలు చేసే వారి కోసమే ఇది
Two-wheeler : మార్కెట్లోకి ఏ కొత్త రకం బైక్, కారు ఇలా వచ్చినా కొందరు కొనుగోలు చేసేస్తారు. కానీ బైక్ డ్రైవ్ చేసేటప్పుడు అసలు హెల్మెట్ పెట్టుకోరు. దీనివల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే రోడ్డు ప్రమాదాలను తగ్గించాలని కొత్త బైక్ కొనుగోలు చేసే వారి విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అవేంటో మరి ఈ స్టోరీలో చూద్దాం.

Two-wheeler : దేశంలో రోజురోజుకీ రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. కేవలం ఒక్క రోజులోనే ఎందరో రోడ్డు ప్రమాదాల వల్ల మృతి చెందుతున్నారు. అతి వేగం, ట్రాఫిక్ రూల్స్ వంటివి పాటించకపోవడం వల్ల ఎక్కువగా యాక్సిడెంట్లు అవుతున్నాయి. దీనికి తోడు ఒక్కోక్కరు ఒకటి కంటే ఎక్కువ వాహనాలు వాడుతున్నారు. మార్కెట్లోకి ఏ కొత్త రకం బైక్, కారు ఇలా వచ్చినా కొందరు కొనుగోలు చేసేస్తారు. కానీ బైక్ డ్రైవ్ చేసేటప్పుడు అసలు హెల్మెట్ పెట్టుకోరు. దీనివల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే రోడ్డు ప్రమాదాలను తగ్గించాలని కొత్త బైక్ కొనుగోలు చేసే వారి విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అవేంటో మరి ఈ స్టోరీలో చూద్దాం.
కొత్త బైక్ కొనుగోలు చేసే సమయంలో రెండు ఐఎస్ఐ సర్టిఫైడ్ హెల్మెట్లు తప్పకుండా ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఢిల్లీలో ఆటో సమ్మిట్ జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ కొత్త రూల్ను ప్రకటించారు. అయితే కేవలం రైడర్ మాత్రమే కాకుండా వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్ ధరించాలని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే ఈ నిర్ణయం తీసుకోవడానికి ముఖ్య కారణం.. యాక్సిడెంట్లను తగ్గించాలనే ఉద్దేశం మాత్రమే. అయితే టూ వీలర్ హెల్మెట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ఈ నిర్ణయానికి కూడా అంగీకరించింది. ఈ కొత్త రూల్ ప్రకారం ఎందరో వేలాది మంది ప్రాణాలు (టీహెచ్ఎంఏ) ఈ నిర్ణయాన్ని స్వాగతించింది. ఈ నిబంధన ద్వారా వేలాది మంది ప్రాణాలను కాపాడవచ్చని భావించింది. అందుకే దేశ వ్యాప్తంగా ఈ రూల్ను తీసుకురావాలనే నిర్ణయం తీసుకున్నారు. ప్రతీ ఏటా దేశంలో ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న దేశాల్లో భారత్ కూడా ఉంది. ప్రతీ ఏడాది 5 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల బారిన యువత ఎక్కువగా ప్రభావితం అవుతుంది.
అతివేగం వల్ల మరణించే వారి సంఖ్యతో పాటు హెల్మెట్ లేకపోవడం వల్ల మృతి చెందే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. కొందరికి హెల్మెట్ ఉన్నా కూడా కనీసం ధరించరు. ఇలాంటి సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే ప్రాణాలు కూడా పోతాయి. అందుకే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త రూల్ వల్ల అయినా ప్రజలు ఇకపై జాగ్రత్తగా డ్రైవ్ చేయడం, హెల్మెట్ వంటివి పెట్టుకోవడం చేస్తారని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఇకపై ప్రమాదాలు పూర్తిగా తగ్గుతాయని అంటున్నారు.