Solar Eclipse: సూర్యగ్రహణం తర్వాత ఈ రాశుల వారికి గడ్డు కాలమే
Solar Eclipse సూర్యగ్రహణం వల్ల ఈ రాశి వారికి కొన్ని ఇబ్బందులు తప్పవు. ముఖ్యంగా ఆర్థికంగా నష్టాలు తప్పవు. ప్రతీ విషయంలో ఏదో ఒక ఆటంకం ఏర్పడుతుంది. ఏ పని చేపట్టినా కూడా సరిగ్గా జరగదు.

Solar Eclipse: రేపే సూర్య గ్రహణం. అయితే ఈ సూర్య గ్రహణం దేశంలో కనిపించదు. అర్థరాత్రి సూర్య గ్రహణం కావడంతో ఇది దేశంలో కాదు.. విదేశాల్లో కనిపిస్తుంది. ఆస్ట్రియా, బార్బడోస్, బెల్జియం, బెర్ముడా, ఉత్తర బ్రెజిల్, కెనడా తూర్పు భాగం, డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీన్‌ల్యాండ్, ఐర్లాండ్ మొదలైన దేశాల్లో కనిపిస్తుంది. అయితే ఈ సూర్య గ్రహణం ఏర్పడటంతో కొన్ని మార్పులు జరుగుతాయి. దీనివల్ల కొన్ని రాశుల వారికి మంచి జరిగితే మరికొన్ని రాశుల వారికి చెడు జరగనుంది. అమావాస్య రోజు సూర్య గ్రహణం కావడంతో గ్రహాల కలయిక వల్ల కొన్ని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇదే మొదటి సూర్య గ్రహణం కావడంతో కొన్ని మార్పులు వస్తున్నాయి. నిజం చెప్పాలంటే ఇది మంచి మార్పు కాదు.. కొన్ని రాశుల వారికి గడ్డు కాలమే అని చెప్పవచ్చు. మన దేశంలో కనిపించని ఈ సూర్య గ్రహణం వల్ల కొన్ని రాశుల వారు బాగా ఇబ్బందులు పడతారు. వీరికి ఉన్న సమస్యలు తీరిపోకుండా ఇంకా పెరుగుతాయని పండితులు చెబుతున్నారు. మరి ఆ రాశులేవో ఈ స్టోరీలో చూద్దాం.
సింహ రాశి
సూర్యగ్రహణం వల్ల ఈ రాశి వారికి కొన్ని ఇబ్బందులు తప్పవు. ముఖ్యంగా ఆర్థికంగా నష్టాలు తప్పవు. ప్రతీ విషయంలో ఏదో ఒక ఆటంకం ఏర్పడుతుంది. ఏ పని చేపట్టినా కూడా సరిగ్గా జరగదు. అన్ని విషయాల్లో ఆటంకం ఏర్పడుతుంది. ముఖ్యంగా వాహనాలు నడిపే వారు జాగ్రత్తగా ఉండాలి. వాహనాల నడిపే సమయంలో ప్రమాదాలు ఎక్కువగా జరగుతాయి. అలాగే అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉదర సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. శత్రువులు పెరుగుతారు. ఇతరులతో గొడవలకు అసలు వెళ్లవద్దు. ఎవరితో మాట్లాడినా కూడా నెమ్మదిగా మాట్లాడండి. ముఖ్యంగా వాదనలకు అయితే అసలు దిగవద్దు.
కన్య రాశి
ఈ గ్రహణం వల్ల కన్యా రాశి వారికి బాగా ఇబ్బందులు వస్తాయి. ముఖ్యంగా వైవాహిక జీవితంలో అయితే బాగా సమస్యలు వస్తాయి. కారణం లేకుండా గొడవలు ఏర్పడతాయి. భార్యాభర్తల మధ్య అపార్థాలు వస్తాయి. కేవలం భాగస్వామితోనే కాకుండా ఇతరలతో కూడా గొడవలు వస్తాయి. కాబట్టి ప్రతీ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే వ్యాపారాల్లో నష్టాలు వస్తాయి. ఈ సమయంలో అసలు వ్యాపారాలు ప్రారంభించవద్దు. ఒకవేళ ప్రారంభిస్తే మాత్రం మీకు నష్టాలు తప్పవు. కొన్ని రోజుల వరకు మాత్రం కష్టంగా ఉంటుంది. ఎక్కువగా ఇబ్బందులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
మీన రాశి
ఈ రాశి వారికి ఇకపై సమస్యలు తప్పవు. సూర్య గ్రహణం వల్ల ప్రతీ విషయంలో అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా గుండె పోటు వచ్చే ప్రమాదం ఉందని పండితులు అంటున్నారు. వీటితో పాటు కంటి సమస్యలు, అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఇంట్లో సమస్యలు, ఆర్థిక సమస్యలు కూడా ఉంటాయి. కాబట్టి ప్రతీ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇతరులతో కాస్త ఆలోచించి వ్యవహరించాలి.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.