Samsung Mobiles: తక్కువ ధరలో బెస్ట్ శాంసంగ్ మొబైల్స్ ఇవే
Samsung Mobiles శాంసంగ్ గెలాక్సీ ఏ26, గెలాక్సీ ఏ36 రెండు మొబైల్ ఫోన్లలో ప్లాస్టిక్ ఫ్రేమ్, గ్లాస్ బ్యాక్ వస్తోంది. ఈ రెండింటిలో కూడా ఒకేలాంటి ఫీచర్లు ఉన్నాయి. అయితే రెండు మొడళ్లు కూడా వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కోసం ఐపీ67 రేటింగ్‌ను ఇస్తున్నాయి.

Samsung Mobiles: మార్కెట్‌లోకి ఎన్నో కొత్త రకాల మొబైల్స్ వస్తుంటాయి. అయితే ఇప్పుడంటే చాలా కంపెనీల మొబైల్స్ వచ్చాయి. ఎన్ని కంపెనీలు వచ్చినా కూడా శాంసంగ్ మొబైల్స్ ఎప్పటికీ బెస్ట్‌గానే ఉంటాయి. ప్రస్తుతం అయితే శాంసంగ్ ఎన్నో రకాల మొబైల్స్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. మంచి డిజైన్లతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లతో అదిరిపోతున్నాయని చెప్పవచ్చు. అయితే ఇటీవల శాంసంగ్ దేశంలో గెలాక్సీ ఏ36, గెలాక్సీ ఏ56 లను తీసుకొస్తుంది. వీటిలో ఇంకా బెస్ట్ ఫీచర్లతో తీసుకొచ్చింది. వీటి ధరలకు ఇవి బెస్ట్ మొబైల్స్ అని చెప్పవచ్చు. అయితే మరి ఈ రెండు మొబైల్స్ ఫీచర్లు ఏంటి? వీటిని ధరలు ఎలా ఉన్నాయో ఈ స్టోరీలో చూద్దాం.
శాంసంగ్ గెలాక్సీ ఏ26, గెలాక్సీ ఏ36 రెండు మొబైల్ ఫోన్లలో ప్లాస్టిక్ ఫ్రేమ్, గ్లాస్ బ్యాక్ వస్తోంది. ఈ రెండింటిలో కూడా ఒకేలాంటి ఫీచర్లు ఉన్నాయి. అయితే రెండు మొడళ్లు కూడా వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కోసం ఐపీ67 రేటింగ్‌ను ఇస్తున్నాయి. అయితే గెలాక్సీ గెలాక్సీ ఏ36 కంటే ఏ26 డైమెన్షన్స్ కాస్త మందంగా ఉంటాయి. అయితే ఈ రెండింటి డిస్ ప్లే కోసం 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.7 ఇంచ్ సూపర్ డిస్‌ప్లే ఉంది. అయితే గెలాక్సీ ఏ26 కంటే గెలాక్సీ ఏ36 కాస్త బ్రైట్‌నెస్ ఎక్కువగా ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఏ26లో ఎక్సినోస్ 1380 చిప్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ యూఎఫ్ఎస్ 2 స్టోరేజ్ ఉన్నాయి. అయితే ఈ గెలాక్సీ ఏ36 మొబైల్ జెన్ 3తో పనిచేస్తుంది.
రెండు స్మార్ట్‌ఫోన్లలో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. చిప్ మొత్తం ఇంటిగ్రేషన్ కోసం రెండింటికి కూడా మంచి బ్యాటరీ లైఫ్ అందిస్తోంది. శాంసంగ్ గెలాక్సీ ఏ26, గెలాక్సీ ఏ36 స్మార్ట్‌ఫోన్‌లు రెండింటిలో కూడా ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. వీటిలో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా కూడా ఉంది. అయితే, ఏ36లో పెద్ద కెమెరా సెన్సార్ ఉంది. రెండు మోడళ్లలో 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా ఉంది. ఇంకోటి ఏంటంటే.. ఏ26లో 2 ఎంపీ మాక్రో లెన్స్ కూడా ఉంది. ఏ36 లో అయితే 5 ఎంపి మాక్రో లెన్స్ ఉంది. దీనివల్ల మొబైల్ బాగా పనిచేస్తుంది. అయితే శాంసంగ్ గెలాక్సీ ఏ26 8 జీబీ ర్యామ్, 28 జీబీ స్టోరేజ్ వేరియంట్ ప్రారంభ ధర రూ.24,999 గా ఉంది. గెలాక్సీ ఏ36 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.32,999గా ఉంది. అయితే ఈ ఫీచర్లకు, ఈ ధరలకు బెస్ట్ అని చెప్పవచ్చు. మీరు ఈ ధరల్లో మొబైల్ తీసుకోవాలని ప్లాన్ చేస్తే తప్పకుండా ఈ మొబైల్ తీసుకోండి.