RBI : RBI గుడ్ న్యూస్.. లోన్ EMI చెల్లించే వారికి ఏప్రిల్ నుంచి వడ్డీ రేట్లు తగ్గింపు..
RBI : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను త్వరలో తగ్గించే అవకాశం ఉంది. రాయిటర్స్ ప్రకారం తాజాగా ఆర్థికవేత్తల సర్వేలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

RBI : సర్వే ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏప్రిల్ లో జరుగుతున్న సమావేశంలో వడ్డీ రేటులను మళ్లీ తగ్గించవచ్చు అని తెలుస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సామాన్యులకు మరోసారి శుభవార్త చెప్పనుంది. రాయిటర్స్ ప్రకారం ఆర్థికవేత్తల సర్వేలో ఏప్రిల్ నెలలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లు తగ్గించవచ్చు అని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లు తగ్గించనుంది. ఆగస్టులో కూడా మరోసారి తగ్గుదల ఉండొచ్చు. తాజాగా జరిగిన రాయితర్స్ సర్వేలో చాలామంది ఆర్థికవేత్తలు ఈ విషయాన్ని అంచనా వేశారు. మార్చి 18,27 మధ్య జరిగిన ఈ సర్వేలో పాల్గొన్న 60 మంది ఆర్థికవేత్తలలో 54 మందికిపైగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన బెంచ్ మార్క్ రేపో రేటును 25 బేసిస్ పాయింట్ల నుంచి తగ్గించి ఆరు శాతానికి తగ్గిస్తుందని నమ్ముతున్నారు. వచ్చేనెల ఏప్రిల్ 7,9 మధ్య జరిగే సమావేశంలో ఈ తగ్గింపు జరగవచ్చు. ఈ క్రమంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏప్రిల్ 9న వడ్డీ రేట్లలో కోతను ప్రకటించే అవకాశం ఉంది. భారతదేశంలో ద్రవయోల్బణం ఫిబ్రవరి నెలలో 3.61% కి తగ్గిన విషయం తెలిసిందే.
అయితే గడిచిన ఏడు నెలల్లో ఇది చాలా అత్యల్పం. ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ 6.4 శాతం రేటుతో వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నారు. గడిచిన నాలుగు సంవత్సరాలలో ఇది అత్యల్పము. ఈ క్రమంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం కనిపిస్తుంది. అలాగే వచ్చే ఏడాది మొదటి ఆరు నెలల పాటు వడ్డీరేట్లలో ఎలాంటి మార్పు ఉండదు అని చెప్తున్నారు. మొత్తం సైకిల్ అంతటా 75 బేసిస్ పాయింట్ లు తగ్గింపు ఉంటుంది. కాబట్టి 2000 ల ప్రారంభం తర్వాత ఇది అత్యల్ప వడ్డీ రేటు తగ్గింపు చక్రం అవుతుందని తెలుస్తుంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రేపో రేటును 2000 ప్రారంభంలో దాని ప్రధాన విధాన సాధనంగా ఉపయోగించడం ప్రారంభించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత నెల ఫిబ్రవరి లో వడ్డీ రేటులను తగ్గించింది. ద్రవ్య విధాన కమిటీ సమావేశం తర్వాత సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా రేపోరేట్లో 25 బేసిస్ పాయింట్లు తగ్గింపును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రెపోరేట్ 6.50 పర్సంటేజ్ నుంచి 6.25 పర్సంటేజ్ కు తగ్గింది. అలాగే ఏప్రిల్ నెల తర్వాత తదుపరి 25 బేసిస్ పాయింట్లు కోత ఆగస్టు నెలలో ఉండవచ్చని సర్వేలో వెళ్లడయ్యింది.
-
Airtel : ఎయిర్టెల్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఒకే ప్లాన్‌లో అన్నీ
-
RBI : ఆర్బీఐ కస్టమర్లకు బిగ్ షాక్.. ఇకపై ఛార్జీలు
-
UPI Payments : UPI ల ద్వారా దుబారా ఖర్చు ఎక్కువ అవుతుందా?
-
Punjab National Bank: ఇల్లు, కారు కొనాలని చూస్తున్నారా? వెంటనే ప్లాన్ చేసుకొండి ఈ బ్యాంకులో అదిరిపోయే ఆఫర్.
-
Hermes Company: ఉద్యోగాలు పోతున్న వేళ.. పింక్ స్లిప్ లు జారీ చేస్తున్న వేళ.. ఈ కంపెనీ చేసిన పనికి ఉద్యోగులు షాక్!
-
Credit Card: క్రెడిట్ కార్డు ఇన్‌యాక్టివ్‌లో ఉందా? యాక్టివేట్ చేయడం ఎలా?