Paytm Solar Sound Box: వ్యాపారులకు గుడ్ న్యూస్.. ఇకపై సోలార్‌తో పేటీఎం సౌండ్ బాక్స్
Paytm Solar Sound Box: పేటీఎం గురించి అందరికీ తెలిసిందే. దేశంలో యూపీఐ పేమెంట్స్ (UPI Payments) వాడే ప్రతి ఒక్కరూ కూడా పేటీఎం (Paytm) వాడుతుంటారు.

Paytm Solar Sound Box: పేటీఎం గురించి అందరికీ తెలిసిందే. దేశంలో యూపీఐ పేమెంట్స్ (UPI Payments) వాడే ప్రతి ఒక్కరూ కూడా పేటీఎం (Paytm) వాడుతుంటారు. ఇప్పుడంటే ఫోన్‌పే (Phonepay), గూగుల్ పే (Google Pay) ఎక్కువగా వాడుతున్నారు. కానీ చాలా మంది వ్యాపారులు మాత్రం ఇప్పటికీ పేటీఎం వాడుతున్నారు. అయితే వ్యాపారుల కోసం పేటీఎం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాపారుల పేటీఎం సౌండ్ బాక్స్‌ను వాడుతుంటారు. దీనికోసం పేటీఎం సోలార్ పేటీఎం సౌండ్ బాక్స్‌ను (Solar Paytm Sound Box) స్టార్ట్ చేసింది. ఈ సోలార్ పేటీఎం సౌండ్ బాక్స్ పగటి సమయాల్లో సూర్యకాంతిలో ఛార్జ్ అవుతుంది.
ఎలాంటి విద్యుత్ లేకపోయినా కూడా ఛార్జింగ్‌తో సౌండ్ వస్తుంది. ప్రస్తుతం వ్యాపారులు చేసుకునే చాలా మంది దీన్ని వాడుతున్నారు. చిన్న వీధి వ్యాపారులకు ఇది బాగా ఉపయోగపడుతుంది. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి దేశంలో అందరూ డబ్బులు పే చేస్తున్నారు. అయితే దీనికి ఛార్జింగ్ పెట్టడం ఎందుకని.. పేటీఎం ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి రోజులో ఒక రెండు లేదా మూడు గంటల పాటు సూర్యకాంతి ఉంటే చాలు. ఇక రోజంతా కూడా ఆ సౌండ్ బాక్స్ పనిచేస్తుంది. అలాగే ఈ సోలార్ సౌండ్‌బాక్స్ ఎలక్ట్రిక్ బ్యాటరీ కూడా 10 రోజుల వరకు ఉంటుంది. ఇందులో ముడు వాట్ స్పీకర్ ఉంటుంది. దీనిద్వారా వాయిస్ ఉంటుంది. అయితే ఈ సౌండ్ బాక్స్‌లో మొత్తం 11 భారతీయ భాషలు వస్తాయి. లావాదేవీలు తొందరగా కావడానికి 4జీ కనెక్టివిటీ కూడా ఉంటుంది.
టెక్నాలజీ ఎంత మారినా కూడా కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కరెంట్ ఉండదు. దీంతో చాలా మంది వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు. గ్రామీణ, రూరల్ ప్రాంతాల్లో కరెంట్ ఉండదు. దీంతో చిన్న వ్యాపారులు, తోపుడు బండ్లు మీద వ్యాపారం చేసుకునే వారు విద్యుత్ కోసం చాలా ఇబ్బంది పడుతుంటారు. కరెంట్ లేకపోతే డిజిటల్ చెల్లింపుల విషయంలో చాలా ఇబ్బందులు వస్తాయి. ఈ క్రమంలోనే పేటీఎం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇకపై చిన్న వ్యాపారులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. పవర్ ఎన్ని రోజులు లేకపోయినా కూడా డిజిటల్ చెల్లింపుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఎల్లప్పుడూ కూడా ఇది పనిచేయడం వల్ల చెల్లింపుల గురించి కూడా తెలుస్తుంది. వ్యాపారంలో ఎలాంటి నష్టం కూడా రాదు.