Paytm: పేటీఎం యూజర్లకు గుడ్ న్యూస్.. ఈ దేశాల్లో ఇకపై ఈజీగా చెల్లింపులు

Paytm: పేటీఎం గురించి అందరికీ తెలిసిందే. దేశంలో యూపీఐ పేమెంట్స్ (UPI Payments) వాడే ప్రతి ఒక్కరూ కూడా పేటీఎం (Paytm) వాడుతుంటారు. ఇప్పుడంటే ఫోన్‌పే (Phonepay), గూగుల్ పే (Google Pay) ఎక్కువగా వాడుతున్నారు. కానీ చాలా మంది మొదటి నుంచి ఎక్కువగా పేటీఎం వాడుతున్నారు. అయితే సాధారణంగా పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే అయినా మన దేశంలో ఉంటేనే అవుతుంది. అదే ఇతర దేశాలకు వెళ్తే ఇవి పనిచేయవు. ఎందుకంటే అక్కడ కరెన్సీ వేరేలా ఉంటుంది. దీంతో మనం ఇతర దేశాలకు వెళ్తే అవి అక్కడ పనిచేయవు. దీనివల్ల చాలా మంది లావాదేవీలు చేయడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. డబ్బులు ఉండి కూడా ఏదైనా వస్తువు వినియోగించడానికి డబ్బులు చెల్లించలేని పరిస్థితిలో ఉండటంతో ఇబ్బంది పడతారు. అయితే ఇలాంటి వారి కోసమే పేటీఎం శుభవార్త తెలిపింది. న్యూ ఫీచర్‌ను పేటీఎం తీసుకొచ్చింది. అంతర్జాతీయ యూపీఐ ఫీచర్‌ను ఉపయోగించి.. ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడ ఈజీగా లావాదేవీలు చేసుకోవచ్చని తెలిపింది. యూఏఈ, సింగపూర్, ఫ్రాన్స్, మారిషస్, భూటాన్, నేపాల్ వంటి దేశాల్లో ఈజీగా చెల్లింపులు చేసుకునేందుకు పేటీఎం కస్టమర్లకు అనుమతిని ఇస్తోంది.
ఇండియా నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సింగపూర్, ఫ్రాన్స్, మారిషస్, భూటాన్, నేపాల్‌లకు వెళ్లే భారతీయ ప్రయాణికులు అక్కడ కరెన్సీని ఎక్ఛేంజ్ చేసుకోవాలి. కానీ ఇకపై అలాంటి ఇబ్బంది లేదు. ఏదైనా షాపింగ్ చేయాలనుకున్నా, అవసరాల కోసం డబ్బును ఉపయోగించాలంటే.. డీఫాల్ట్‌గా కొత్త ఫీచర్ యాక్సెస్ అవుతుంది. అయితే దీనికోసం మీరు బ్యాంక్ ఖాతాకు లింక్ చేసుకుని వన్ టైమ్ యాక్టివేషన్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మీరు ఈజీగా అంతర్జాతీయ పేమెంట్స్ చేసుకుంటారు. అయితే మీరు అక్కడికి వెళ్లిన తర్వాత అంతర్జాతీయ యూపీఐ చెల్లింపులను సెటప్ చేసుకోవడం మరిచిపోయారనుకోండి. దాన్ని యాక్టివేట్ చేసుకోవాలని ఆటోమెటిక్‌గా మెసేజ్ కూడా వస్తుంది. అయితే యూపీఐ యాక్సెస్ ఇచ్చిన ప్రదేశాల్లో మాత్రమే దీన్ని మీరు వినియోగించాలి. సమ్మర్ వచ్చేస్తుంది. ఈ సమయంలో సెలవులు ఎక్కువగా ఉండటంతో చాలా మంది ప్రయాణాలు చేస్తుంటారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణాలు చేసేందుకు పేటీఎం ఈ నిర్ణయం తీసుకుంది. ట్రిప్ వ్యవధిని బట్టి పేటీఎం వినియోగదారులు ఈ కొత్త ఫీచర్‌ను వినియోగించుకోవాలి. అంటే దాదాపుగా 90 రోజుల వరకు ఉంటుంది. మీరు ఈ మధ్యలో ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు ఎంచుకోవాలి. ఆ తర్వాత ఆటోమెటిక్‌గా క్లోజ్ చేసేస్తారు. భద్రతా ప్రయోజనాల కోసమే కొంత వ్యవధి తర్వాత క్లోజ్ చేస్తారు. దీంతో ఆ తర్వాత నగదు విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండదని పేటీఎం ఈ నిర్ణయం తీసుకుంది.