April New Rules: నేటి నుంచి కొత్త రూల్.. పీఎఫ్ అప్లై చేసిన వెంటనే అకౌంట్లోకి?
April New Rules పీఎఫ్ డబ్బులు అప్లై చేసుకున్న మూడు రోజులకే అకౌంట్లోకి డబ్బులు జమ అవుతాయి. గతంలో వారం, పది రోజులు పట్టేది. కానీ ప్రస్తుతం మూడు రోజుల్లోనే అవుతుంది.

April New Rules: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) నుంచి డబ్బులు విత్‌డ్రా చేయాలంటే చాలా పెద్ద పని. మీరు ఆన్లైన్లో అప్లై చేసుకుని.. కొన్ని రోజుల తర్వాత డబ్బులు అకౌంట్లోకి వస్తాయి. దీంతో అత్యవసర సమయాల్లో డబ్బులు బాగా ఇబ్బంది అవుతాయి. అయితే పీఎఫ్ డబ్బు విత్ డ్రా విషయంలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే డబ్బులు అత్యవసరం ఉంటేనే పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకుంటారు. వెంటనే డబ్బులు కావాలని చూస్తారు. అయితే నేటి నుంచి పీఎఫ్ విత్ డ్రా విషయంలో కొత్త రూల్ వచ్చింది. పీఎఫ్ డబ్బులు అప్లై చేసుకున్న తర్వాత ఎక్కువ రోజులు కాకుండా.. కేవలం మూడు రోజుల్లోనే డబ్బులు విత్ డ్రా అవుతాయి. అది ఎలాగో ఈ స్టోరీలో చూద్దాం.
పీఎఫ్ డబ్బులు అప్లై చేసుకున్న మూడు రోజులకే అకౌంట్లోకి డబ్బులు జమ అవుతాయి. గతంలో వారం, పది రోజులు పట్టేది. కానీ ప్రస్తుతం మూడు రోజుల్లోనే అవుతుంది. ఆ రూల్ కూడా నేటి నుంచే అమలు కానుంది. మీరు ఒక్కసారి ఒక లక్ష వరకు కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. పిల్లల వివాహం, ఆసుపత్రి, చదువు ఇలా వ్యక్తిగత ఖర్చుల కోసం తప్పకుండా డబ్బులు తీసుకోవచ్చు. ఇకపై ఎలాంటి కష్టం, ఎక్కువ సమయం పట్టకుండా మీరు పీఎఫ్ డబ్బులను విత్ డ్రా చేసుకోవచ్చు. ఈ కొత్త రూల్ ప్రకారం మీరు డబ్బులు తీసుకుంటే 60 శాతం వరకు డబ్బు పంపిణీ అవుతుంది. కేవలం మూడు రోజుల్లో మీకు లక్ష వరకు వస్తుంది. అయితే మీరు ఈ కొత్త రూల్ నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకోవాలనుకుంటే మాత్రం తప్పకుండా చెక్ బుక్, బ్యాంక్ పాస్‌బుక్‌ను పీఎఫ్‌కి ఇవ్వాలి. అలాగే కేవైసీని అప్డేట్ చేశాక క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. మీరు ఇలా చేసుకోవాలంటే తప్పకుండా ఆధార్ కార్డుకు యూఏఎన్ నంబర్ లింక్ అయి ఉండాలి. ఏవైనా తప్పులు ఉంటే వెంటనే సరిచేసుకోండి. అప్పుడు మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కేవలం మూడు రోజుల్లో మీ డబ్బులు తిరిగి వస్తాయి.
గతంలో మీరు ఇచ్చిన అకౌంట్‌కి విత్ డ్రా డబ్బులు వచ్చేవి. కానీ ఇప్పుడు మీరు గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, యూపీఐ చెల్లింపుల ద్వారా ఈజీగా పీఎఫ్ డబ్బులను విత్ డ్రా చేసుకోవచ్చు. నేటి నుంచే ఈ కొత్త రూల్ రానుంది. పీఎఫ్ డబ్బులు వెంటనే అవసరం అయిన వారు వీటిని విత్ డ్రా చేసుకోవచ్చు. ఆన్లైన్లో మీరు అప్లై చేసుకున్న మూడు రోజులకే మీ అకౌంట్లోకి డబ్బులు వచ్చేస్తాయి. ఎలాంటి ఇబ్బంది లేకుండా డబ్బులు వస్తాయి.