Motorola: రూ.6999 కే 50MP కెమెరా ప్రీమియం లుక్ ఫోన్..!

Motorola: ప్రముఖ టెక్ బ్రాండ్ మోటోరోలా తనదైన శైలిలో దూసుకుపోతోంది. తక్కువ ధరలో స్మార్ట్ ఫోన్లను రిలీజ్ చేసి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఈ ఏడాది జనవరిలో ఎంట్రీ లెవెల్ మోటరోలా G05 స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇప్పుడు ఈ ఫోన్ పై అదిరిపోయే డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీనిని కేవలం రూ.6,999 లకే కొనుక్కోవచ్చు. ఎంతో ప్రీమియం లుక్ తో రిలీజ్ అయిన ఈ ఫోన్ అందర్నీ ఎట్రాక్ట్ చేస్తుంది. అంతేకాకుండా అధునాతన ఫీచర్లను సైతం ఈ ఫోన్ కలిగి ఉంది.
ధర
మోటో g05 స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లో కేవలం ఒకే వేరియంట్ లో అందుబాటులోకి వచ్చింది. 4gb ram + 64 జిబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ.6999గా కంపెనీ నిర్ణయించింది. ప్రస్తుతం ఈ ఫోన్ ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ఫారం ఫ్లిప్కార్ట్ లో మరిన్ని తగ్గింపు ఆఫర్లతో అందుబాటులో ఉంది. ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పై 5 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది. దీంతో మరింత తక్కువ ధరకే దీనిని పొందొచ్చు. ఈ ఫోన్ రెండు కలర్ వేరియంట్లలో వచ్చింది. ఒకటే ప్లం రెడ్, మరొకటి పారెస్ట్ గ్రీన్.
స్పెసిఫికేషన్స్
MOTO G05 ఫోన్ 6.67 అంగుళాల LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 90Hz రీఫ్రెష్ రేట్‌తో వస్తుంది. 1000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. దీని డిస్ప్లే కార్నింగ్ గొరెల్లా గ్లాస్ 3 సెక్యూరిటీని పొందుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ హీలియో G81 Extreme SoC ప్రాసెసర్ చిట్‌సెట్ తో వర్క్ అవుతుంది. ఇది 4GB ర్యామ్, 64GB స్టోరేజీతో వస్తుంది. వర్చువల్‌గా ర్యామ్‌ను పెంచుకొనే అవకాశం ఉంది. దాదాపు 12GB వరకు ర్యామ్‌ను పొడిగించుకోవచ్చు.
మైక్రో SD కార్డుతో 1TB వరకు స్టోరేజీని విస్తరించవచ్చు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత Hello UI (Skin On Top) OSతో వస్తుంది. అంతేకాకుండా దీనిలో 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌తోపాటు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందవచ్చు. ఈ ఫోన్ బ్యాటరీ విషయానికొస్తే.. 18W వైర్ ఛార్జింగ్ సపోర్టుతో 5200mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. డిజైన్ విషయానికొస్తే.. ఈ ఫోన్ వేగాన్ లెదర్ బ్యాక్ ప్యానల్‌తో వస్తుంది. ఇది పంచ్ హోల్ డిజైన్‌ను కలిగి ఉంది. వాటర్ టచ్ టెక్నాలజీతో వస్తుంది.
వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం ఇది IP52 రేటింగ్‌ను కలిగి ఉంది. కెమెరా విభాగం గురించి మాట్లాడితే.. ఇందులో క్వాడ్ పిక్సల్ టెక్నాలజీతో 50MP ప్రైమరీ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరాను అందించారు. ఈ ఫోన్ సేఫ్టీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా 4G LTE, బ్లూటూత్ 5.4, WiFi, GPS వంటి ఫీచర్లను కలిగి ఉంది.
-
Exams complete: విద్యార్థులకు పరీక్షలు ముగిశాయా.. ఓ కన్నేసి ఉంచండి
-
Rashmika Mandanna: రష్మిక ఆస్తులు తెలిస్తే.. షాక్ కావాల్సిందే
-
Concentration: ఏకాగ్రత ఉన్నవారిలో కనిపించే లక్షణాలివే
-
Indian Post: GDS రిజల్ట్స్ వచ్చేసాయ్.. ఇలా చెక్ చేసుకోండి!
-
TVS Jupiter: చీపెస్ట్ స్కూటీ.. ప్రారంభ ధర రూ.53వేలు.. 226కి.మీ గరిష్ట మైలేజ్.. !
-
Motorola: 8జీబీ ర్యామ్ ఫోన్ వెరీ చీప్.. రూ.10వేల లోపే!