Mobile Settings: ఈ సెట్టింగ్స్ మారిస్తే.. పోయిన ఫోన్ మళ్లీ దొరకాల్సిందే

Mobile Settings:
ప్రస్తుతం అందరూ కూడా ఎక్కువగా మొబైల్స్ (Mobiles) వాడుతున్నారు. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి సాయంత్రం నిద్రపోయే వరకు మొబైల్ వాడుతున్నారు. ఈ మొబైల్ ఒక్క క్షణం కనిపించకపోతే చాలు. కొందరు అయితే రోజంతా వీటితోనే గడుపుతున్నారు. అయితే పొరపాటున కొన్నిసార్లు మనం మొబైల్‌ను పోగొట్టుకుంటాం. తొందరలో ఎక్కడైనా మరిచిపోవడం లేదా ఇంట్లో ఏదో మూలన ఉంచడం, ఎవరైనా మొబైల్‌ను (Mobile) దొంగతనం చేయడం వంటివి జరుగుతుంటాయి. అయితే ఒకసారి మొబైల్ ఫోన్ పోతే మళ్లీ దొరకడం కష్టం. దీంతో చాలా మంది మొబైల్ ఫోన్ (Mobile) పోయిన వెంటనే ఆశలు వదులుకుంటారు. ఒకసారి మొబైల్ ఫోన్ పోతే మళ్లీ దొరకడం కష్టమని లైట్ తీసుకుంటారు. అయితే మీ ఫోన్ పోయినా కూడా తిరిగి మీ దగ్గరకు రావాలంటే మాత్రం కొన్ని సెట్టింగ్స్ (Settings) మార్చాలి. మీరు కొన్ని సెట్టింగ్స్ (Settings) మారిస్తే మీ మొబైల్ పోదు. అయితే మొబైల్లో మార్చాల్సిన ఆ చిట్కాలేంటో చూద్దాం.
మీ ఫోన్ ఎవరికైనా కూడా దొరికిన వెంటనే ఫస్ట్ అందరూ కూడా చేసే పని స్విచ్ ఆఫ్. అదే మీరు మీ మొబైల్‌ను స్విచ్ ఆఫ్ చేయకుండా ఉండాలంటే కొన్ని సెట్టింగ్స్ మార్చాలి. మీ మొబైల్లో సెట్టింగ్స్‌కి వెళ్లి మోర్ సెక్యూరిటీ అండ్ ప్రైవసీపై క్లిక్ చేయాలి. రిక్వైర్డ్ పాస్వర్డ్ టూ పవర్ ఆఫ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేసి అక్కడ ఉండే పవర్ ఆఫ్ బటన్‌ను ఆనన్ చేయాలి. మీరు ఇలా సెట్టింగ్స్ ఆన్ చేస్తే మీ మొబైల్‌ను ఇతరులు స్వి్చ్ ఆఫ్ చేయలేరు. స్విచ్ ఆఫ్ చేసే ముందు తప్పకుండా పాస్వర్డ్ అడుగుతుంది. ఆ పాస్వార్ట్ తెలియకుండా ఇతరులు మీ ఫోన్‌ను ఇతరులు తీసుకోలేరు. దీంతో పాటు ఫోన్‌ను ఫ్లైట్ మోడ్ ఆప్షన్ కూడా పెట్టుకోవాలి.
ఎవరైనా మీ మొబైల్ ఫోన్ తీసుకునే ముందు ఫ్లైట్ మోడ్‌లో పెడతారు. కాబట్టి మీ పర్మిషన్ లేకుండా ఫ్లైట్ మోడ్ పెట్టే విధంగా సెట్టింగ్స్ మార్చుకోవాలి. దీనికోసం మీరు కంట్రోల్ సెంటర్ లాక్ చేసుకోవాలి. వీటిని మార్చుకోవాలంటే సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. ఆ తర్వాత స్టేటస్ బార్‌ను క్లిక్ చేసి లాక్ స్క్రీన్ నోటిఫికేషన్ క్లిక్ చేయాలి. ఆ తర్వాత స్వైప్ డౌన్ ఆన్ లాక్ స్క్రీన్ టూ వ్యూ నోటిఫికేషన్ డ్రాయర్ అనే బటన్‌ను ఆఫ్ చేస్తే సరిపోతుంది. మొబైల్లో ఫైండ్ మై డివైజ్‌ను కూడా ఆన్ చేసుకోవాలి. దీనివల్ల మీ మొబైల్ పోతే దీనివల్ల మీ మొబైల్ లొకేషన్‌ను ట్రాక్ చేయవచ్చు. వీటివల్ల మీ మొబైల్ కనిపించకపోయినా కూడా ఈజీగా గుర్తించవచ్చు. ఎవరూ కూడా మీ మొబైల్‌ను కొట్టేయకుండా ఉంటారు. ప్రతీ ఒక్కరూ కూడా మొబైల్లో ఈ సెట్టింగ్స్‌ను తప్పకుండా మార్చుకోవాలి.