Zomato Layoffs: జోమాటోలో లేఆఫ్స్ షురూ.. ఏఐ ఎఫెక్టేనా?
Zomato Layoffs గురుగ్రామ్‌కు చెందిన కంపెనీ గతేడాది జొమాటో అసోసియేట్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ కోసం 1,500 మంది ఉద్యోగులను తీసుకుంది. కస్టమర్ సపోర్ట్ రోల్స్ కోసమని తీసుకుంది.

Zomato Layoffs: ప్రస్తుతం చాలా కంపెనీలలో ఎక్కువగా లే ఆఫ్స్ జరుగుతున్నాయి. అందులోనూ ఏఐ వచ్చిన తర్వాత మనుషుల వాడకం తగ్గింది. ఉద్యోగాలు ఇలా అన్నింటికి కూడా చాట్ జీపీటీని వాడుతున్నారు. దీనివల్ల కొన్ని కంపెనీలు ఉద్యోగాల నుంచి కొందరిని తీసేస్తున్నాయి. దీనివల్ల ఖర్చులు కూడా తగ్గుతాయని భావిస్తున్నాయి. అయితే జోమాటో కూడా ఇదే బాటలో నడుస్తోంది. కంపెనీ ఖర్చులను తగ్గించుకోవడానికి జొమాటో 600 మంది కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ల ఉద్యోగాలను తొలగించింది. గతంతో పోలిస్తే ప్రస్తుతం జొమాటో ఫుడ్ డెలివరీలో కాస్త ఆర్డర్లు తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మూడవ త్రైమాసిక లాభాలు బాగా తగ్గాయి. దాదాపుగా 57 శాతం తగ్గడంతో జోమాటో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే జోమాటోకి లాభాలు తగ్గడానికి ముఖ్య కారణం బ్లింకిట్. దీంట్లో కూడా నష్టాలు భారీగా రావడంతో జోమాటో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
గురుగ్రామ్‌కు చెందిన కంపెనీ గతేడాది జొమాటో అసోసియేట్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ కోసం 1,500 మంది ఉద్యోగులను తీసుకుంది. కస్టమర్ సపోర్ట్ రోల్స్ కోసమని తీసుకుంది. అయితే తీసుకున్న వారికి సేల్స్, ఆపరేషన్స్, ప్రోగ్రామ్ మేనేజ్మెంట్, సపోర్ట్, సప్లయ్ చైన్, కేటగిరీ టీమ్స్ ఇలా అన్నింటిలో కూడా పదోన్నతలు కల్పించింది. అయితే వారిలో ఒక 600 మందిని రెన్యువల్ చేయలేదు. కేవలం ఒక నెల వేతనం ఇచ్చి నోటీసులు ఇవ్వకుండా ఉద్యోగులను తొలగించింది. అయితే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఏఐ నడుస్తోంది. దీని ద్వార కస్టమర్ సపోర్ట్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించినట్లు తెలుస్తోంది. దీని ద్వార జొమాటో ఉద్యోగాలను భర్తీ చేస్తుందన వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే ఉద్యోగాల నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎక్కువగా లేఆఫ్స్ జరుగుతున్నాయి. కేవలం జోమాటో అనే కాకుండా ఎన్నో కంపెనీలు చాలా మంది ఉద్యోగస్తులను తొలగిస్తోంది. కనీసం ఎలాంటి నోటీసులు లేకుండా ఉద్యోగం నుంచి తొలగిస్తుంది. కంపెనీ ఖర్చులను తగ్గించుకోవడానికి ఉద్యోగం నుంచి తీసేస్తుంది. దీనికి తోడు ప్రస్తుతం ఏఐ రావడంతో.. దీనివల్ల చాలా మంది ఉద్యోగాలు పోతున్నాయి. భవిష్యత్తులో కూడా ఏఐ వల్ల ఎక్కువగా ఉద్యోగాలకు లోటు వస్తుందని నిపుణులు అంటున్నారు.