Paytm: Paytm అర్థం ఏంటో మీకు తెలుసా?
Paytm భారతదేశపు ప్రముఖ ఫిన్‌టెక్ కంపెనీల్లో ఒకటిగా ఎదిగిన పేటీఎం (Paytm) Pay Through Mobile అనే అర్థాన్ని సూచిస్తుంది. మొబైల్ ద్వారా ఈజీగా డిజిటల్ చెల్లింపులు చేసే సర్వీస్ అని దీని అర్థం.

Paytm: ప్రస్తుతం దేశంలో ఎక్కువ మంది డిజిటల్ పేమెంట్స్ వాడుతున్నారు. ఏ చిన్న వస్తువు కొనుగోలు చేయాలన్నా కూడా డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నారు. దీంతో వీటిని వాడుతున్న వారి సంఖ్య బాగా పెరిగింది. ఇప్పుడుంటే ఫోన్‌పే, గూగుల్ పే ఇలా చాలా వచ్చాయి. కానీ ఒకప్పుడు మాత్రం చాలా మంది పేటీఎం వాడేవారు. ఫోన్ పే, గూగుల్ పే వచ్చిన తర్వాత వీటిని వాడే వారి సంఖ్య బాగా తగ్గింది. అయితే ప్రస్తుతం కొందరు పేటీఎం వాడుతున్నారు. డిజిటల్ పేమెంట్ ప్లాట్ ఫారమ్‌లలో దేశంలో బాగా ప్రాచుర్యం పొందిన దాంట్లో ఇది ఒకటి. ఈ సేవలను కోట్లాది మంది వాడుతున్నారు. ఏదైనా షాపింగ్ చేయాలన్నా మొబైల్ రీఛార్జ్‌లు, డబ్బు బదిలీలు, బిల్లు చెల్లింపులు, ట్రావెల్ టికెట్ బుకింగ్, ఇన్వెస్ట్‌మెంట్స్ ఇలా చెప్పుకుంటూ పోతే అన్నింటికి కూడా వీటినే వాడుతున్నారు. అయితే పేటీఎం (Paytm) అంటే మనలో చాలా మందికి సరిగ్గా అర్థం తెలియదు.

Paytm (2)
భారతదేశపు ప్రముఖ ఫిన్‌టెక్ కంపెనీల్లో ఒకటిగా ఎదిగిన పేటీఎం (Paytm) Pay Through Mobile అనే అర్థాన్ని సూచిస్తుంది. మొబైల్ ద్వారా ఈజీగా డిజిటల్ చెల్లింపులు చేసే సర్వీస్ అని దీని అర్థం. అయితే Paytmను 2009లో విజయ్ శేఖర్ శర్మ ప్రారంభించారు. ఈ సమయంలో ఇది కేవలం మొబైల్ రీఛార్జ్‌లు, డీటీఎచ్ రీఛార్జ్‌లు మాత్రమే జరిగేవి. ఆ తర్వాత దేశంలో డిజిటల్ పేమెంట్స్‌కి భారీగా ఆదరణ పెరిగింది. దీంతో పేటీఎం ద్వారా లావాదేవీలు బాగా జరిగాయి. అయితే ప్రస్తుతం దేశంలో డిజిటల్ పేమెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. Paytm ద్వారా UPI పేమెంట్స్, QR కోడ్ లావాదేవీలు, Paytm Wallet, బ్యాంకింగ్ సర్వీసులు, బిల్లు చెల్లింపులు, షాపింగ్, ట్రావెల్ టికెట్ బుకింగ్, ఇన్వెస్ట్‌మెంట్స్, ఇన్‌షురెన్స్, లోన్స్ వంటి అనేక సేవలు అందుబాటులో ఉన్నాయి. చిన్న వ్యాపారాల నుంచి పెద్ద సంస్థల వరకు అందరూ కూడా ఉపయోగిస్తున్నారు.
ఇదిలా ఉండగా యూపీఐ ద్వారా ఎక్కువగా లావాదేవీలు జరగడంతో సైబర్ మోసాలు కూడా పెరుగుతున్నాయి. అప్పటి కంటే ప్రస్తుతం 50 శాతం వరకు సైబర్ మోసాలు బాగా పెరిగాయి. యూపీఐ వల్ల వీటి బారిన పడిన వారి సంఖ్య కూడా బాగా పెరిగింది. అయితే ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం కూడా తీసుకుంది. నేటి నుంచి ఇతరులకు కేటాయించిన మొబైల్ నంబర్లు, ఇన్ యాక్టివ్ ఉన్న మొబైల్ నంబర్లకు ఉన్న యూపీఐ సేవలు నిలిచిపోతాయి. ఈ విషయాన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది. మోసాలను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.