BYD Car: ఎలక్ట్రిక్ కారు సంచలనం.. 5 నిమిషాల్లో 470 కి.మీ.అన్ని కార్లకు చెక్
BYD Car: మార్కెట్‌లోకి కొత్త కొత్త కార్లు వస్తుంటాయి. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ యుగంలో ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలు వస్తున్నాయి. బైక్‌ల నుంచి కార్ల వరకు అన్ని కూడా ఛార్జింగ్ పెట్టుకునేవే.

BYD Car: మార్కెట్‌లోకి కొత్త కొత్త కార్లు వస్తుంటాయి. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ యుగంలో ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలు వస్తున్నాయి. బైక్‌ల నుంచి కార్ల వరకు అన్ని కూడా ఛార్జింగ్ పెట్టుకునేవే. చాలా మంది కూడా వీటినే ఎక్కువగా కొనడానికి ఇష్టపడుతున్నారు. అయితే కొన్ని ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువ సమయం ఛార్జ్ పెట్టడానికి సమయం ఉంటే.. మరికొన్ని వాహనాలు మాత్రం చాలా తక్కువ సమయంలోనే ఛార్జ్ అవుతాయి. నిజం చెప్పాలంటే కొన్ని నిమిషాల్లోనే ఛార్జ్ ఫుల్ అవుతాయి. కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు ఎన్నో కి.మీలు ప్రయాణిస్తాయి. అయితే పెట్రోల్, డీజిల్ వేస్తే ఎలా కార్లు ప్రయాణిస్తాయో.. కొన్ని నిమిషాల పాటు ఛార్జింగ్ పెడితే అలాగే ఎలక్ట్రిక్ కార్లు ప్రయాణిస్తాయి. అయితే చైనాకి చెందిన ఈ కార్ల తయారీ సంస్థ అద్భుతమైన కారును తీసుకొచ్చింది. BYD అనే కార్ల కంపెనీ కేవలం 5 నిమిషాల్లో మొత్తం ఛార్జింగ్ ఎక్కే ఎలక్ట్రిక్ కారును తీసుకువచ్చింది. ఈ కారుకు కేవలం 5 నిమిషాలు ఛార్జింగ్ పెడితే చాలు దాదాపుగా 470 కి.మీ లు ప్రయాణిస్తుంది. అంటే ఒక్కసారి కారుకు ఛార్జింగ్ పెడితే దాదాపుగా 292 మైళ్లు ప్రయాణించగలదు. అయితే ఈ కంపెనీ కార్ల అమ్మకాలను వచ్చే నెల నుంచి ప్రారంభించనుంది.
టెస్లాను దాటి మరి ఈ కంపెనీ మంచి అభివృద్ధిని సాధిస్తోంది. ఈ కార్ల కంపెనీ కొత్త ఫ్లాట్‌ఫామ్‌ను కూడా తీసుకొచ్చింది. ఈ BYD కంపెనీ ప్రపంచంలో అత్యధిక కార్లు అమ్మింది. అయితే ఈ కార్లు త్వరలో భారత్ మార్కెట్‌లోకి కూడా రానున్నట్లు తెలిపింది. అయితే కారులో పెట్రోల్, ఇంజిన్ నింపే సమయంలో వాహనాన్ని ఈజీగా ఛార్జ్ చేయవచ్చు. కొన్ని నిమిషాలు ఛార్జ్ చేసిన తర్వాత దీన్ని ఎన్ని కిలో మీటర్లు అయినా కూడా ప్రయాణించవచ్చు. దూర ప్రయాణాలకు కూడా ఈ కారు బాగా ఉపయోగపడుతుంది. టెస్లా కార్లు 15 నిమిషాలు ఛార్జింగ్ అవుతుంది. ఈ 15 నిమిషాల్లో కూడా దాదాపుగా 275 కిలోమీటర్లు ప్రయాణించగలవు. అయితే ప్రపంచంలో టెస్లా చాలా పెద్ద కంపెనీ. దీన్ని దాటడానికి BYD కంపెనీ ప్రయత్నిస్తోంది. ఈ BYD కంపెనీ కార్లు గంటలకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగానికి రెండు సెకన్ల వేగవంతంగా వెళ్లగలవు. అయితే ఈ కార్లు ఏప్రిల్ నుంచి అమ్మకానికి అందుబాటులో ఉంటాయి.