Business Loans : ఆ విషయంలో పురుషుల కంటే మహిళలే ఎక్కువట.. అప్పులు చేసి మరీ..

Business Loans :
మహిళలు అన్నింటిలో ముందే ఉంటారు. ఒకప్పటి మాదిరి కాదు ప్రస్తుతం కాలం మారింది. సో అన్నింటిలో అప్డేట్ అవ్వాల్సిందే. మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పనా? కార్లు, బంగ్లాల కోసం పురుషులు తెగ తాపత్రయ పడతారు అనుకుంటారు కదా. కానీ వారికి మించి మహిళలు కూడా ఆలోచిస్తున్నారట. ఏకంగా ఆలోచనతోనే ఆగిపోవడం లేదు. రుణాలు తీసుకొని వారి కలలను సాకారం చేసుకుంటున్నారు. అవును చాలా మంది మహిళలు ఇదే విధానం పాటిస్తున్నారు. మరి ఈ విషయం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందామా?
నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం, మహిళలు వినియోగ వస్తువులు అంటే ఇళ్ళు కొనడానికే 42 శాతం వ్యక్తిగత రుణాలు తీసుకున్నారట. బ్యాంకు నుంచి రుణాలు తీసుకునే మహిళలు ప్రధానంగా సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాలకు చెందినవారే అవడం గమనార్హం. భారతదేశ ఆర్థిక వృద్ధి విషయానికి వస్తే రుణగ్రహీతల నుంచి బిల్డర్ల వరకు’ మహిళల పాత్ర అనే శీర్షికతో నీతి ఆయోగ్ ఒక నివేదికను విడుదల చేసింది. ఇందులో ఈ విషయం వెల్లడైంది. క్రెడిట్ స్కోర్ విషయంలో కూడా జాగ్రత్త పడుతున్నారట. గత 5 సంవత్సరాలలో, రుణాలు తీసుకునే మహిళల సంఖ్య 22 శాతం పెరిగింది.
బంగారం తాకట్టు పెట్టి..
మహిళలు తమ అవసరాలను తీర్చుకోవడానికి తీసుకున్న రుణాన్ని ఉపయోగిస్తున్నారని నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం అన్నారు. ఈ నివేదికను ప్రారంభిస్తూ, మహిళా పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సహాయం అందించడానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఆయన తెలిపారు. ఈ నివేదికలో 3% మంది మహిళలు మాత్రమే వ్యాపారం కోసం రుణాలు తీసుకున్నారట. 38% మంది మహిళలు బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నారని తేలింది.
పురుషుల కంటే మహిళలే ఎక్కువ..
గత 5 సంవత్సరాలలో వ్యాపార రుణాల కోసం తెరిచిన ఖాతాల సంఖ్య 4.6 రెట్లు పెరిగింది. ఈ కాలంలో, ఉత్తర, మధ్య భారతదేశ రాష్ట్రాలలో పురుషుల కంటే మహిళలు ఎక్కువ రుణాలు తీసుకున్నారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మహిళలకు రుణాలు ఇచ్చే అవకాశం ఉందట. ఇక మహిళలు రుణాలు తీసుకోవడం ద్వారా తమ ఆర్థిక శక్తిని పెంచుకోవాలనుకుంటున్నారు అని తేలింది.
క్రెడిట్ స్కోర్
మహిళల్లో క్రెడిట్ స్కోర్ గురించి అవగాహన కూడా పెరిగిందట. నివేదిక ప్రకారం, క్రెడిట్ స్కోర్‌లను సెర్చ్ చేసే యువతుల రేటు ఏటా దాదాపు 56 శాతం పెరుగుతోంది. డిసెంబర్ 2024 నాటికి, 2.7 కోట్ల మంది మహిళలు తమ క్రెడిట్ స్కోర్‌ను స్వయంగా తెలుసుకుంటున్నారు. ఇది గత సంవత్సరం కంటే 42% ఎక్కువ. క్రెడిట్ స్కోర్‌ను తెలుసుకోవడంలో 5 రాష్ట్రాలు మాత్రమే 49 శాతం భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయి. వీటిలో మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, యుపి, తెలంగాణ ఉన్నాయి.
మెట్రో నగరాల కంటే మెట్రోయేతర ప్రాంతాలలో క్రెడిట్ మానిటరింగ్ చేస్తున్న మహిళల సంఖ్య వేగంగా పెరుగుతోందని కూడా ఈ నివేదిక పేర్కొంది. మెట్రోయేతర ప్రాంతాలలో క్రెడిట్ పర్యవేక్షణ చేస్తున్న మహిళల సంఖ్య 48 శాతం పెరిగింది, మెట్రో నగరాల్లో ఈ రేటు 30 శాతంగా ఉంది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.
-
Gold prices : కొండెక్కుతున్న పసిడి ధరలు.. ఆల్‌టైమ్ రికార్డు స్థాయిలో గోల్డ్
-
Gold loan: ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. గోల్డ్ లోన్ ఇకపై రావడం డౌటే
-
Gold: బంగారం కొనుగోలు చేయడానికి పర్సనల్ ఇస్తారా? ఒకవేళ తీసుకుంటే ఏమవుతుంది?
-
Gold Loan: గోల్డ్ లోన్‌పై న్యూ రూల్స్.. నోటీస్ లేకుండా బంగారం వేలం వేస్తే ఏమవుతుందో మీకు తెలుసా?