BSNL: బీఎస్ఎన్ఎల్ బెస్ట్ ప్లాన్.. బెనిఫిట్స్ తెలిస్తే రీఛార్జ్ చేయకుండా ఉండలేరు
టెలికాం సంస్థలు మొబైల్ రీఛార్జ్ ప్లాన్ల ధరలు భారీగా పెంచిన విషయం తెలిసిందే. దేశంలో అన్ని టెలికాం సంస్థలు ఒక్కసారిగా ధరలను పెంచాయి.

BSNL: టెలికాం సంస్థలు మొబైల్ రీఛార్జ్ ప్లాన్ల ధరలు భారీగా పెంచిన విషయం తెలిసిందే. దేశంలో అన్ని టెలికాం సంస్థలు ఒక్కసారిగా ధరలను పెంచాయి. దీంతో చాలా మంది వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. ఒకప్పుడు తక్కువగా రీఛార్జ్ ధరలు ఉంటే.. ఇప్పుడు మొబైల్స్‌కు రీఛార్జ్ చేయాల్సి వస్తే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. అంతలా దేశంలో మొబైల్ రీఛార్జ్ ధరలు పెరిగిపోయాయి. అయితే ఈ క్రమంలో ప్రభుత్వ రంగ టెలికాం ఆపరేటర్ బీఎస్ఎన్ఎల్ అయితే తక్కువ ధరలకే రీఛార్జ్ ప్లాన్లను తీసుకొచ్చింది. లాంగ్ వాలిడిటీ ప్లాన్లతో బీఎస్ఎన్ఎల్ కస్టమర్లను ఎక్కువగా ఆకర్షిస్తోంది. మిగతా నెట్‌వర్క్‌లో ఒక నెలకు వేసిన ప్లాన్‌తో బీఎస్ఎన్ఎల్ అయితే మొత్తం ఏడాది ప్లాన్ వేసుకోవచ్చు. అలాంటి ప్లాన్లు బీఎస్ఎన్ఎల్లో ఉన్నాయి. అయితే కస్టమర్ల కోసం బీఎస్ఎన్ఎల్ మంచి ప్లాన్ ను తీసుకొచ్చింది. కేవలం రూ.397 రూపాయలతో 150 రోజుల వాలిడిటీ ప్లాన్‌ను బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌లో అపరిమిత కాల్స్‌తో పాటు రోజుకు 2జీబీ డేటా లభిస్తుంది. తక్కువ బడ్జెట్లో ఎక్కువ రోజులతో ఈ ప్లాన్ బాగా ఉపయోగపడుతుంది. వినియోగదారులు అందరూ కూడా ఈ ప్లాన్ తీసుకుంటే హ్యాపీగా 150 రోజులు పాటు వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ ద్వారా బీఎస్ఎన్ఎల్ కస్టమర్లు కూడా పెరుగుతారు.
Read also: ఆండ్రాయిడ్ యూజర్లకు బిగ్ షాక్.. కేంద్రం హెచ్చరికలు జారీ
బీఎస్ఎన్ఎల్లో ఇవే ప్లాన్లు కాకుండా ఇంకా చాలా ప్లాన్లు ఉన్నాయి. బీఎస్ఎన్ఎల్లో 70 రోజులు, 180 రోజులు, 160 రోజులు, 336 రోజులు, 365 రోజులు వంటి అనేక ప్లాన్లు ఉన్నాయి. వీటిలో ఎక్కువగా 150 రోజుల ప్లాన్ బాగా పాపులర్ అయ్యింది. ఈ ప్లాన్ ద్వారా చాలా మంది కస్టమర్లకు బాగా ఉపయోగపడుతుంది. ఈ ప్లాన్ల వల్ల వినియోగదారులకు బెస్ట్ ఆప్షన్ అనిపిస్తుంది. అందుకే చాలా మంది ఈ ప్లాన్లు తీసుకుంటారు. అయితే ఈ 150 రోజుల ప్లాన్ తర్వాత యూజర్లు ఎక్కువగా 160 రోజుల ప్లాన్ కూడా తీసుకుంటారు. ఇది కూడా వినియోగదారులకు బాగా ఉపయోగపడుతుంది. వినియోగదారులకు మొదటి 30 రోజులు అపరిమిత కాలింగ్ లభిస్తుంది. వినియోగదారులు మొదటి 30 రోజులు ప్రతిరోజూ 2GB డేటాను కూడా పొందుతారు. ఈ విధంగా ఈ ప్లాన్‌లో మొత్తం 60జీబీ డేటా అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్‌లో యూజర్లకు ఉచితంగా 100 ఎస్ఎంఎస్లు కూడా వస్తాయి. తక్కువ ఖర్చుతో మీరు ఈ ప్లాన్‌ను బాగా ఉపయోగించవచ్చు. ఈ 160 రోజుల ప్లాన్ ధర రూ. 997. దీనివల్ల మీకు డైలీ 2జీబీ డేటాతో పాటు అపరిమిత కాల్స్ కూడా లభిస్తాయి.
Read also: ఉత్తర అమెరికాలో భూగర్భ చినుకులు ఎందుకు వస్తున్నాయో తెలుసా?