Bumper Offer: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. ఒక్కో ఉద్యోగికి రూ.4 లక్షల బోనస్.. ఛాన్స్ కొట్టేశారుగా..
Bumper Offer: నిజానికి చాలా మంది జీతం కోసమే ఉద్యోగం చేస్తారు. జీతం వస్తుందనే ఉద్దేశంతోనే జాబ్ చేస్తారు. కానీ కనీసం ఇంట్రెస్ట్ మీద అయితే ఎవరూ కూడా ఉద్యోగం చేయరు.

Bumper Offer: నిజానికి చాలా మంది జీతం కోసమే ఉద్యోగం చేస్తారు. జీతం వస్తుందనే ఉద్దేశంతోనే జాబ్ చేస్తారు. కానీ కనీసం ఇంట్రెస్ట్ మీద అయితే ఎవరూ కూడా ఉద్యోగం చేయరు. కంపెనీకి, ఉద్యోగస్థులకు జీతం మధ్యలోనే అనుబంధం ఉంటుంది. ఉద్యోగస్థులు ఎంత కష్టపడి ఉద్యోగం చేసినా కూడా కంపెనీ అభినందించదు. దీంతో అందరూ కూడా ఏదో ఉద్యోగం చేయాలనే చేస్తారు. కానీ అసలు ఆసక్తితో చేయరు. కంపెనీ కూడా ఉద్యోగస్థుల కష్టాన్ని గుర్తించి అసలు బోనస్ వంటివి కూడా ఇవ్వవు. కంపెనీకి నష్టాలు వస్తే కొందరు ఉద్యోగస్థులను తీసేస్తారు. కానీ లాభం వస్తే మాత్రం అసలు బోనస్ ఇవ్వరు. కానీ ఓ కంపెనీ మాత్రం తమకు లాభాలు వచ్చాయని ఉద్యోగస్థులకు బోనస్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. బోనస్ అంటే వేలు కాదు.. ఏకంగా రూ.4 లక్షలే ఒక్కో ఉద్యోగస్తునికి బోనస్ ఇవ్వనుంది. ఉద్యోగస్థుల శ్రమకు గుర్తించి మరి కంపెనీ బోనస్‌ను ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
ప్రముఖ లగ్జరీ బ్రాండ్ హర్మెస్ అనే కంపెనీ పారిస్‌లో ఉంది. ఈ కంపెనీకి అనుకోకుండా లాభాలు వచ్చాయి. అలాగే వ్యాపారంలో కూడా మంచి ఎదుగుదల వచ్చింది. దీంతో కంపెనీ ఉద్యోగస్థులకు బోనస్‌ను ప్రకటించింది. వారి సంస్థలో పని చేసే ఒక్కో ఉద్యోగికి 4,500 యూరోలు బోనస్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. మన ఇండియన్ కరెన్సీలో రూ.4 లక్షలు అన్నమాట. ఈ కంపెనీ ఫ్యాషన్ రంగంలో బాగా అభివృద్ధి సాధించింది. అతిపెద్ద సంస్థల్లో ఇది కూడా ఒకటిగా కొనసాగుతోంది. గతేడాది ఈ కంపెనీ ఆదాయం 15.2 బిలియన్ యూరోలు. 2023తో పోలిస్తే గతేడాది దాదాపుగా 15 శాతం లాభాలను ఆర్జించింది. దీంతో ఉద్యోగస్థులకు బోనస్‌ను ప్రకటించింది. కంపెనీ ఉద్యోగులు కూడా ఎంతో నమ్మకంగా పని చేస్తున్నారు. అయితే ఈ కంపెనీలో గతేడాది 1300 మంది ఉద్యోగులు ఉండేవారు. కానీ ప్రస్తుతం 25000 మంది ఉద్యోగులు ఉన్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కంపెనీ ఎంత బాగా ఉన్నతంగా ఎదిగిందనే విషయం. ఈ కంపెనీ కేవలం పారిస్‌లోనే కాకుండా చికాగో, జపాన్, ఫ్రాన్స్, బీజింగ్, షెన్‌జెన్‌తో పాట మరికొన్ని నగరాల్లో కూడా ఉంది. ఇంకా ఈ స్టోర్లను పెంచాలని భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో పలువురు ఇలాంటి కంపెనీలో ఉద్యోగం చేసే అదృష్టవంతులు. అసలు ఉద్యోగస్థులు అడగకుండానే కంపెనీ బోనస్ ఇస్తుందని అంటున్నారు. నిజానికి వర్క్ చేసినా కూడా అడిగితే కంపెనీ బోనస్ ఇవ్వదు. అలాంటిది ఉద్యోగస్థులు అడగకుండానే కంపెనీ బోనస్ ఇస్తుందంటే.. అదృష్టవంతులనే చెప్పుకోవచ్చని కొందరు నెటిజన్లు అంటున్నారు. మరి మీ కంపెనీ ఎలా ఉంటుందో కామెంట్ చేయండి.