Smart Tv: 32-అంగుళాల స్మార్ట్ టీవీలు.. రూ.10వేలలోపే!

Smart Tv: భారతదేశంలో స్మార్ట్‌టీవలకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. పేద, మధ్య తరగతి కుటుంబాలు సైతం పెద్ద పెద్ద టీవీలను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రముఖ కంపెనీలు తక్కువ ధరలో అధునాతన ఫీచర్లు అందించి వారిని అట్రాక్ట్ చేస్తున్నాయి. ముఖ్యంగా భారతదేశంలో సరసమైన 32-అంగుళాల స్మార్ట్ టీవీలు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. వినియోగదారులు పెద్ద 43-అంగుళాల, 55-అంగుళాల మోడళ్ల కంటే కాంపాక్ట్, బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్లనే ఇష్టపడుతున్నారు. అందులో Redmi, Acer, Infinix, Motorola, Toshiba, Thomson వంటి అనేక బ్రాండ్లు ఉన్నాయి. ఈ కంపెనీలు కేవలం రూ.12,000 లోపు ఫీచర్-ప్యాక్డ్ స్మార్ట్ టీవీలను అందిస్తున్నాయి. ఇవి ఎంతోమంది స్మార్ట్‌టీవీ ప్రేక్షకులకు అందుబాటులో ఉన్నాయి. అందువల్ల భారతదేశంలో అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ 32 అంగుళాల స్మార్ట్ టీవీలు.. వాటి ధర తెలుసుకుందాం.
భారతదేశంలో లో బడ్జెట్ 32-అంగుళాల స్మార్ట్ టీవీలు Amazonలో అందుబాటులో ఉన్నాయి. అందులో Redmi 32-అంగుళాల F సిరీస్ స్మార్ట్ టీవీ ధర రూ.10,999 గా ఉంది. అదే సమయంలో సెలెక్ట్ చేసిన బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించే కస్టమర్‌లు రూ.1,000 తగ్గింపును పొందవచ్చు. అప్పుడు దీనిని కేవలం రూ.9,999కే సొంతం చేసుకోవచ్చు. ఇక దీని ఫీచర్ల విషయానికొస్తే.. ఇది డాల్బీ ఆడియో సపోర్ట్‌తో రెండు 10W స్పీకర్‌లను కలిగి ఉంటుంది. దీని సౌండ్ ఎంతో అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది. ఇదిలా ఉంటే ఈ టీవి మాత్రమే కాకుండా దీంతో పాటు మరికొన్ని ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అందులో ఇన్ఫినిక్స్ 32-అంగుళాల HD రెడీ LED స్మార్ట్ లైనక్స్ టీవీ మరొకటి. ఇది 52% తగ్గింపును కలిగి ఉంది. ఈ డిస్కౌంట్ తర్వాత ఫ్లిప్‌కార్ట్‌లో ఇది రూ.7,999కి లిస్ట్ అయింది. అలాగే సెలెక్ట్ చేసిన బ్యాంక్ కార్డ్‌లపై 5% క్యాష్‌బ్యాక్ ఆఫర్ పొందొచ్చు. అప్పుడు మరింత తక్కువకే ఇది లభిస్తుంది.
మరో బడ్జెట్ టీవీ విషయానికొస్తే.. Acer I Pro సిరీస్ 32-అంగుళాల స్మార్ట్ గూగుల్ టీవీ అమెజాన్‌లో చీపెస్ట్ ధరలో లభిస్తుంది. దీని ధర రూ.10,499గా కంపెనీ నిర్ణయించింది. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌హోల్డర్లు రూ.1,000 తగ్గింపును పొందవచ్చు. అప్పుడు దీని ధరను రూ.9,499కి తగ్గించవచ్చు. Google TV OSలో నడుస్తున్న ఇది డాల్బీ ఆడియో, 30W స్పీకర్‌లను కలిగి ఉంది. ఇది ఆడియో అనుభవాన్ని అందిస్తుంది. అలాగే Motorola 32-అంగుళాల QLED HD రెడీ స్మార్ట్ గూగుల్ టీవీ మరొక బడ్జెట్ టీవీ. దీని ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ.10,999గా ఉంది. కొనుగోలుదారులకు అదనంగా 5% క్యాష్‌బ్యాక్ ఆఫర్‌తో లభిస్తుంది.