AP Temperatures: దంచి కొడుతున్న ఎండలు.. ఏపీలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు

AP Temperatures: ఏపీలో( Andhra Pradesh) ఎండల తీవ్రత అధికంగా ఉంది. ఉక్కపోతకు జనాలు అల్లాడిపోతున్నారు. నడి వేసవి రాకముందే ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు రోడ్లు మీదకు రావాలంటే హడలైపోయే పరిస్థితి నెలకొంది. ఇది ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మున్ముందు ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రత దిమ్మదిరిగేలా ఉంది. రికార్డు స్థాయిలో టెంపరేచర్ నమోదు అవుతోంది. 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం సర్వసాధారణంగా మారింది.
* దాదాపు అన్ని జిల్లాల్లో..
శ్రీకాకుళం జిల్లా( Srikakulam district) నుంచి అనంతపురం జిల్లా వరకు ఎండలు దంచి కొడుతున్నాయి. దాదాపు అన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదు అవుతోంది. ఈ ఎండలకు వడగాల్పులు తోడవుతున్నాయి. వేడి గాలులు మరింతగా జనానికి ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల్లో వేడి గాలులు, ఉష్ణోగ్రతలు పంజాబీసులు ఉన్నాయి. ఏప్రిల్, మే నెలల్లో ఉష్ణోగ్రతల తీవ్రత 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉండవచ్చని అంచనాలు వెలువడుతున్నాయి.
* రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు..
రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు( temperature ) నమోదయ్యాయి. నంద్యాల జిల్లాలోని పెద్ద దేవలాపురంలో 42.7°, కర్నూలు జిల్లా ఉలిందకొండలో 42.6 డిగ్రీలు, కడప జిల్లా ఖాజీపేటలో 41.8° గరిష్ట ఉష్ణోగ్రత నమోదయినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరోవైపు ఈరోజు 58 మండలాల్లో వడగాల్పులిగించే అవకాశం ఉంది. శ్రీకాకుళం జిల్లాలో 13, విజయనగరం జిల్లాలో 18, పార్వతీపురం మన్యం జిల్లాలో 14, అల్లూరి సీతారామరాజు జిల్లాలో మూడు, కాకినాడలో రెండు, తూర్పుగోదావరిలో ఏడు, ఏలూరులో ఒక మండలంలో వడగాలులు వీ స్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. గురువారం కూడా దీని తీవ్రత కొనసాగుతుందని.. 37 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కూర్మనాధ్ తెలిపారు.