YS Jagan: విజయవాడ సబ్ జైల్ వద్ద క్యాసీన్ హై.. ఓ చిన్నారి ఏడుపు.. దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టిన జగన్!

YS Jagan: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. గన్నవరం టిడిపి కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగిని కిడ్నాప్ చేశారని కారణం చూపుతూ ఏపీ పోలీసులు హైదరాబాదులో ఉన్న వంశీని అరెస్టు చేశారు. విజయవాడ కోర్టులో హాజరు పరిచారు. 14 రోజులపాటు రిమాండ్ విధించింది న్యాయస్థానం. ప్రస్తుతం విజయవాడ సబ్ జైల్లో వల్లభనేని వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయనను ఈరోజు వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. ములఖత్ అయ్యారు. ఆయనతో దాదాపు అరగంట పాటు సమావేశం అయ్యారు. జగన్మోహన్ రెడ్డి సబ్ జైలు వద్దకు వస్తున్నారని తెలిసి భారీగా జనాలు అక్కడికి చేరుకున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా అక్కడకు తరలివచ్చారు.
* బోరున విలపించిన చిన్నారి..
ఈ తరుణంలో ఆసక్తికర విషయం ఒకటి అక్కడ వెలుగు చూసింది. జగన్మోహన్ రెడ్డిని కలవాలంటూ చిన్నారి బోరున విలపించింది. అన్నా ప్లీజ్.. ప్లీజ్ అన్నా అంటూ జగన్ నూ కలవాలంటూ రిక్వెస్ట్ చేసింది. ఈ విషయం గమనించిన జగన్మోహన్ రెడ్డి వెంటనే స్పందించారు. ఆ చిన్నారిని దగ్గరగా తీసుకుని ఆప్యాయంగా ముద్దు పెట్టారు. జగన్మోహన్ రెడ్డిని కలిసానని ఆనందంతో ఆ పాప కూడా ఆయన నుదుటిపై ముద్దు పెట్టింది. అనంతరం వైయస్ జగన్ తో కలిసి సెల్ఫీ దిగింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.