APPSC : ఏపీపీఎస్సీ పరీక్షల తేదీలు వెల్లడి

APPSC Exams Dates: ఏపీలో పలు గవర్నమెంట్ ఉద్యోగాలకు ఎగ్జామ్స్ డేట్‌లను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) తాజాగా రిలీజ్ చేసింది. ఇందులో భాగంగానే ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్, జూనియర్ కాళాశాలల్లో జూనియర్ లెక్చరర్, డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్ పోస్టులకు సంబంధించిన తేదీలు ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా.. TTD పరిధిలో ఉన్న డిగ్రీ కాలేజీలు, జూనియర్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టులకు సంబంధించిన రాతపరీక్ష తేదీలను సైతం APPSC వెల్లడించింది. ఈ పరీక్షల తేదీల షెడ్యూలు ప్రకారం.. జూన్ 16 నుంచి 26 వరకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే.. జూన్ 20-22 మధ్య ఎలాంటి ఎగ్జామ్స్ లేవు.
ఇతర పరీక్షల తేదీలు
APPSC
ఏపీపీఎస్సీ మరికొన్ని పోస్టులకు సంబంధించిన పరీక్షల తేదీలను సైతం వెల్లడించింది. అందులో మెడికల్ & వెల్ఫేర్ సర్వీస్ డిపార్ట్‌మెంట్‌లో లైబ్రేరియర్ పోస్టులు, ఏపీ టౌన్ ప్లానింగ్ & కంట్రీ ప్లానింగ్ సర్వీస్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు, వెల్ఫేర్ ఆఫ్ డిఫరెన్‌ట్లీ ఏబుల్డ్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులకు ఎగ్జామ్స్ డేట్స్ ప్రకటించింది. ఈ ఉద్యోగాలకు పరీక్షలను ఏప్రిల్ 28 నుంచి ఏప్రిల్ 30 వరకు నిర్వహించనున్నట్లు APPSC వెల్లడించింది. ఇందులో భాగంగానే పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను అఫీషియల్ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.
అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులకు ఏప్రిల్ 28, 29 తేదీల్లో పరీక్షలు ఉంటాయి.
లైబ్రేరియన్ పోస్టులకు ఏప్రిల్ 27, 28 తేదీల్లో పరీక్ష ఉంటాయి.
అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు ఏప్రిల్ 28, 30 తేదీల్లో పరీక్ష ఉంటాయి.
అసిస్టెంట్ కెమిస్ట్ పోస్టులకు ఏప్రిల్ 28, 29 తేదీల్లో పరీక్ష ఉంటాయి.
అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు ఏప్రిల్ 28న పరీక్ష ఉంటాయి.
దివ్యాంగులు ట్రాన్స్‌జెండర్, సీనియర్ సిటిజన్స్ సంక్షేమశాఖలో అసిస్టెంట్ డైరైక్టర్ పోస్టులకు ఏప్రిల్ 27, 28 తేదీల్లో పరీక్షలు ఉంటాయి.
అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులకు ఏప్రిల్ 28, 29 తేదీల్లో పరీక్ష ఉంటాయి.
ఏపీ ఫిషరీస్ డిపార్ట్‌మెంట్‌లో ఏప్రిల్ 28, 29 తేదీల్లో పరీక్షలు ఉంటాయి.
-
Jobs: డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు.. నెలకు జీతం లక్షా
-
Peddi Movie: RC16 సినిమా టైటిల్ ఫిక్స్.. రామ్ చరణ్ లుక్ గూస్ బంప్స్
-
Jobs: పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు.. నెలకు రూ.60 వేలకు పైగా జీతం
-
Allu Arjun-Trivikram Movie: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. త్రివిక్రమ్, బన్నీ మూవీ ఎప్పుడో రివిల్ చేసిన నిర్మాత