AP: పదవ తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఈ నంబర్‌కి వాట్సాప్ చేస్తే హాల్ టికెట్ వచ్చేస్తుంది

AP:
ఏపీలో పదవ తరగతి పరీక్షలు మార్చి 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ పరీక్షలు పూర్తి అయిన వెంటనే పదో తరగతి పరీక్షలు ప్రారంభం అవుతాయి. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే మార్చి 17వ తేదీన ప్రారంభమైన పరీక్షలు 31వ తేదీ వరకు ఏపీలో జరగనున్నాయి. ఈ క్రమంలో ముందుగానే పాఠశాలలు హాల్ టికెట్లను విడుదల చేశారు. పరీక్షల ముందు అయితే విద్యార్థులు కాస్త టెన్షన్ అవుతారని ముందుగానే ప్రభుత్వం విడుదల చేసింది. అయితే హాల్ టికెట్లకు స్కూల్ వరకు వెళ్లకుండా వాట్సాప్ ద్వారానే డౌన్‌లోడ్ చేసుకునే విధానాన్ని ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనివల్ల విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఈ నిర్ణయం తీసుకుంది. అధికారిక వెబ్ సైట్ bse.ap.gov.in ద్వారా కూడా విద్యార్థులు హాల్ టికెట్ తీసుకువచ్చు. అయితే ఏపీ ప్రభుత్వం ఇటీవల మిత్ర గవర్నెన్స్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీని ద్వారా కూడా హాల్ టికెట్లు పొందవచ్చని ఏపీ ప్రభుత్వం తెలిపింది. పదవ తరగతి విద్యార్థులు వాట్సాప్‌లో 9552300009 ను సంప్రదిస్తే హాల్ టికెట్ వస్తుందని తెలిపింది.
పదో తరగతి విద్యార్థులు 9552300009 నెంబర్‌కి Hi అని ముందుగా మెసేజ్ చేయాలి. వెంటనే మీకు రిప్లే వస్తుంది. మీకు కావాల్సిన సేవను ఎంచుకోండనే ఆప్షన్ వస్తుంది. మీరు విద్య సేవలు అనే ఆప్షన్ ఎంచుకోండి. ఆ తర్వాత ఇంటర్మీడియట్, పదవ తరగతి హాల్ టికెట్స్ అనే ఆప్షన్ వస్తుంది. దీనిలో పదవ తరగతి హాల్ టికెట్స్‌పై క్లిక్ చేయాలి. అందులో మీరు మీ అప్లికేషన్ నంబర్, విద్యార్థి గుర్తింపు సంఖ్య, పుట్టిన తేదీ అన్ని వివరాలు ఫిల్ చేయాలి. ఇలా చేసిన తర్వాత మీకు రెగ్యులర్ గా చదువుతున్నారా లేకపోతే ప్రైవేట్‌లో చదువుతున్నారా అని అడుగుతుంది. మీకు కావాల్సిన ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అన్ని వివరాలు కూడా ఫిల్ చేసిన తర్వాత పదో తరగతి హాల్ టికెట్ మీకు వస్తుంది. దీన్ని డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకుంటే అయిపోయింది. మీరు స్కూల్‌కు వెళ్లకుండా ఈజీగా ఇంటి నుంచే పదవ తరగతి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీని వల్ల విద్యార్థులకు కొంత సమయం ఆదా అవుతుంది. టైమ్ వేస్ట్ ఉండదు. అయితే పదవ తరగతి పరీక్షలు అంటే విద్యార్థులకు కాస్త ఆందోళన ఉంటుంది. ఎందుకంటే చిన్న వయస్సులో ఈ పబ్లిక్ పరీక్షలు అంటే తప్పకుండా టెన్షన్ ఉంటుంది. ఎక్కువగా టెన్షన్ తీసుకోకుండా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ప్రశాంతంగా ఉండి.. మంచిగా పరీక్షలు రాయండి.